Sunday, November 3, 2024

ఎనిమిది శాతం పెరిగిన భారత నిరుద్యోగ శాతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత నిరుద్యోగ శాతం నవంబర్ నెలలో 8 శాతానికి పెరిగింది. ఇది మూడు నెలల్లో అత్యధికం. అక్టోబర్ నెలలో నిరుద్యోగ శాతం 7.77గా ఉండింది. ముంబైకి చెందిన ‘సెంటర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ’(సిఎంఐఈ) గురువారం దీనికి సంబంధించిన డేటా విడుదలచేసింది. పట్టణ నిరుద్యోగం 7.21 శాతం నుంచి నవంబర్‌లో 8.96 శాతానికి పెరిగిందని, కాగా గ్రామీణ నిరుద్యోగం 8.04 శాతం నుంచి 7.55 శాతానికి తగ్గిందని డేటా వివరించింది. ప్రభుత్వం తన నెలవారీ గణాంకాలు వెలువడించనప్పటికీ సిఎంఐఈ మాత్రం జాగ్రత్తగా గమనించి గణాంకాలు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News