Friday, November 22, 2024

ట్విట్టర్‌కు పోటీగా ‘కూ’

- Advertisement -
- Advertisement -

India’s Koo App will compete with Twitter

 

న్యూఢిల్లీ : ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తాను సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘కూ’లో అకౌంట్ తెరిచినట్టు ప్రకటించారు. ఇది ఒక మేక్ ఇన్ ఇండియా యాప్ అని, దీనికి అధికారిక ట్విట్టర్‌తో పాటు మద్దతు పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐ! మంత్రి రవిశంకర్ ప్రసాద్ గతంలోనే కూ యాప్‌లో అకౌంట్ ప్రారంభించినట్లు తెలిపారు. ఐటీ, ఇండియా పోస్ట్‌తో పాటు పలు ప్రభుత్వ విభాగాల్లో ఈ ప్లాట్‌ఫారంపై హ్యాండిల్ వెరిఫై చేశారు. కూ అనేది ట్విట్టర్ తరహాలోని మరో యాప్. ఇది 10 నెలల క్రితమే ఆవిష్కృతమయ్యింది. ఇది ఆత్మనిర్భర్ యాప్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచింది. ఈ యాప్ అపారమేయ రాధాకృష్ణ, మయంక్ బిదావడ్కాలు అభివృద్ధి చేశారు. ఈ యాప్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒడిశా, అస్సామీ తదితర భాషలలో అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్‌లో దీని డౌన్‌లోడ్ పేజ్‌లో ఉన్న వివరాల ప్రకారం ’కూ‘ను భారతీయులు తమ మాతృభాషలో అభిప్రాయాలను వెల్లడించేందుకు, చర్చించేందుకు రూపొందించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News