Sunday, November 3, 2024

రామగుండంలో విజయవంతమైన తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్!

- Advertisement -
- Advertisement -
మరిన్ని యూనిట్లను పెట్టబోతున్న ఎన్‌టిపిసి

రామగుండం: తెలంగాణలోని రామగుండంలో 1978లో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టిపిసిని ఏర్పాటుచేశారు. తొలి థర్మల్ యూనిట్‌తో విద్యుత్తును ఉత్పత్తిచేసి దక్షిణాది రాష్ట్రాలకు విద్యుత్తును సరఫరాచేసింది. రామగుండంలోని ఎన్‌టిపిసి 2640 మెగావాట్ల సామర్థమున్న ప్లాంట్‌గా ఎదిగింది. ఇది దేశంలో అతిపెద్ద సైట్‌గా ఉంది.

2022 మధ్య కాలంలో రామగుండంలో తొలిసారి అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్తు ప్లాంట్ నెలకొల్పింది. ఇది 100 మెగావాట్ల ఫోటోవోల్టయిక్(పివి) యూనిట్. దీనిని బిహెచ్‌ఈఎల్ నిర్వహిస్తోంది. ప్లాంట్‌ను నిర్మించిన ఆరునెలల్లోనే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడం మొదలెట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు యూనిట్లు ఉన్నాయి. ఒక్కోటి 25 మెగావాట్ల ఉత్పత్తితో 100 మెగావాట్ల ఏసి, 145 మెగావాట్ల డిసి సామర్థం కలిగి ఉంది. భారత్‌లోనే నిర్మించిన దాదాపు 4.5 లక్షల సోలార్ పివి మాడ్యూల్స్‌ను ఈ ప్లాంట్‌లో ఉపయోగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News