Monday, December 23, 2024

క్రీడల్లో భారత్‌ది సరికొత్త చరిత్ర : మురళీధర్‌ రావు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భారత్ వంద పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిందని బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మురళీధర్ రావు అన్నారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో క్రీడాకారులకు నైపుణ్య శిక్షణతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. ఆసియా క్రీడలలో భారత్ విజయభేరి మోగించి త్రివర్ణ పతాకం రెపరెపలాడటానికి  నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషియే కారణం అన్నారు.

పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో రాజకీయంగా చేయాల్సిన కార్యాచరణపై ప్రణాళిక సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రచార కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో జరగుతున్న అవినీతి గురించి ప్రజలకు తెలియజేసేలా రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. బిఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కకుండా ప్రజలు తీర్పు ఇస్తారని వెల్లడించారు. కేంద్ర కేబినెట్ తెలంగాణకు కృష్ణా నీటి పంపకాలను నిర్ణయించేలా ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. కృష్ణా జలాల వాటా విషయంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ప్రజల న్యాయపరమైన వాటా అందుకునేందుకు వీలవుతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News