Monday, January 20, 2025

ఆస్కార్‌లో మన వాళ్లు చరిత్ర సృష్టిస్తారా?

- Advertisement -
- Advertisement -

నాటు నాటు, ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విష్పర్స్– మూడు నామినేషన్లు!

న్యూఢిల్లీ: మన సినీ రంగం నుంచి మూడు నామినేషన్లు ఆస్కార్‌కు నామినేట్ అయ్యాయి. 95వ అకాడమీ అవార్డ్‌లో భారత్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? అన్నది చూడాలి. సోమవారం హాలీవుడ్‌లోని డోల్బి థియేటర్‌లో తేలిపోనున్నది. ‘ఒరిజినల్ సాంగ్’కు తెలుగు సినిమా పాట ‘నాటు నాటు…’ షార్ట్‌లిస్ట్ అయింది. డాక్యుమెంటరీ ఫీచర్‌కు ‘ఆల్ దట్ బ్రీత్స్’ పోటీపడుతోంది. ఇక డాక్యుమెంటరీ షార్ట్‌కు ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ బరిలో ఉంది. భారత్ నుంచి తొలిసారి ఇలా నామినేషన్లు వెల్లడం గొప్ప అనే చెప్పాలి. కానీ మనవాళ్లు ఉనికిని మాత్రమే చాటుకుంటారా లేక విజేతలుగా నిలుస్తారా? అన్నది వేచి చూడాలి. ఐదు ఒరిజినల్ సాంగ్ నామినీలలో మన ట్రిపుల్ ఆర్ సినిమా పాట ‘నాటు నాటు..’ పోటీపడుతోంది. ఇంతవరకు ఆస్కార్‌లో కేవలం తెల్లవాళ్లే ఉంటున్నారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలో మన దేశం నుంచి దీపికా పడుకొణె అవార్డులను స్టేజ్ మీద బహూకరించనున్నారు. ఇదో మార్పు. గెలుపు కోసం ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ చేయగలిగినదంతా చేస్తోంది. ఇప్పటికే ఈ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకుని ఉంది. ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ అనేది నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ. అది దిక్కులేనిదైన ఏనుగు, దాని ఇద్దరు మావాటులపై కథ ఆధారపడింది.

గతంలో 1983లో ‘గాంధీ’ సినిమా బెస్ట్ కాస్టూమ్ డిజైన్ గెలుచుకోవడమే కాకుండా, ఎనిమిది ట్రోఫీలను కూడా గెలుచుకుంది. 1992లో దిగ్గజ డైరెక్టర్ సత్యజిత్ రేకు ‘ఆనరరీ ఆస్కార్’ పురస్కారం లభించింది. ఇదివరలో ఏఆర్. రహ్మాన్ స్వరకల్పన చేసిన ‘జై హో’ పాట(స్లమ్‌డాగ్ మిలియనీర్) గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకుంది. ఇదంతా ఒకెత్తయితే… భారత్ ఇప్పటి వరకు ఆస్కార్ అవార్డును గెలువలేదు. కాకపోతే ‘లగాన్’, ‘నో మ్యాన్స్ ల్యాండ్’, ‘మదర్ ఇండియా’, ‘సలామ్ బాంబే’, ‘వాటర్’ సినిమాలు నామినేషన్ల వరకు వెళ్లాయి, కానీ ఆస్కార్ గెలువలేదు. ఈసారైనా మన వాళ్లు కీర్తి పతాకాన్ని ఎగురవేస్తారేమో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News