Sunday, December 22, 2024

144,00,00,000 ఇది మన దేశ జనాభా

- Advertisement -
- Advertisement -
142.5 కోట్ల జనాభాతో రెండవ స్థానంలో చైనా
మరో 77 ఏళ్లలో రెట్టింపు కానున్న భారత్ జనాభా
15 64 ఏళ్ల వారు
68శాతం మంది
తగ్గిన ప్రసూతి మరణాలు
మెరుగైన వైద్య సేవలు

న్యూఢిల్లీ : ప్రపంచం మొత్తం మీద 144.17 కోట్ల జనాభాతో భారత్ మొదటి స్థానంలో ని లిచింది. 142.5 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానంలో ఉందని యునైటెట్ నేషన్స్ పా ప్యులేషన్ ఫండ్ (యుఎన్‌ఎఫ్‌పిఎ) నివేదిక వె ల్లడించింది. ‘లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య హ క్కుల్లో అసమానతల ముగింపు’ అన్న శీర్షిక తో ఈ నివేదిక వెలువడింది. 77 ఏళ్లలో భార త దేశ జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ఈ ని వేదిక ప్రకారం భారత దేశంలో మొత్తం జనా భాలో 24 శాతం మంది 14 ఏళ్ల లోపు వారు కాగా, 17 శాతం మంది 10 నుంచి 19 ఏళ్ల లోపు వారు. 26 శాతం మంది 10 నుంచి 24 ఏళ్ల లోపు వారుండగా, 15 నుంచి 64 ఏళ్ల లోపు వారు 68 శాతం వరకు ఉన్నారు. 65 ఏళ్లు అంతకు మించి వయసున్న వారు 7 శాతం వరకు ఉండగా, పురుషుల ఆయు ర్దాయం 71 ఏళ్లు, మహిళల ఆయుర్దా యం 74 ఏళ్ల వరకు ఉంటోందని ని వేదిక వివరించింది. లైం గి క, పునరుత్పత్తి ఆరో గ్యం లో గత 30 ఏళ్లలో పురో గతి ఉంటున్నప్ప టికీ, ప్రపంచం మొ త్తం మీ ద అట్టడుగు వర్గాల్లో చాలావరకు నిర్లక్షం క నిపిస్తోంది. దేశంలో 2006 23 మధ్య కాలంలో బాల్యవివా హాల రేటు 23 శా తం వరకు ఉం డడం విశేషం. భారత దేశంలో ప్ర సూతి మరణాలు చాలావరకు తగ్గా యి. ప్రపంచం మొత్తం మీద ఈ మ రణాల్లో భారత్‌లో 8 శాతం వరకు ఉంటున్నాయి. ప్రసూతి సేవల్లో నాణ్యత పెరగడమే దీనికి కారణం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News