Monday, December 23, 2024

‘జన భారత్’ మనమే నెం.1

- Advertisement -
- Advertisement -

India's population surpasses China's

వచ్చే ఏడాది 142 కోట్లకు పైగా
ఐరాస నివేదికలో వెల్లడి
ప్రపంచ జనం 800 కోట్లు

న్యూయార్క్ : వచ్చే ఏడాది 2023లో జనాభా విషయంలో భారత్ చైనాను అధిగమించనుంది. ఇది 142కోట్లు దాటుతుంది. ఐరాస నివేది ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన జనాభా విభాగం తాజా నివేదికలో తెలిపారు. ఈ విధంగా భారతదేశం వచ్చే సంవత్సరం ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్య జనాభా దేశం అవుతుందని నివేదికతో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా ఈ ఏడాది నవంబర్ మధ్యనాటికి 800 కోట్లకు చేరుతుంది.నిమిషానికి 270 మంది జన్మించే క్రమంలో జనాభా సంఖ్య ఈ మేరకు చేరుకోనుంది. ఇందులో భారతదేశపు జనసంఖ్య అప్పటికీ 142 కోట్లను దాటుతుందని నివేదికలో తెలిపారు. ప్రస్తుత భారత జనాభా 141.2 కోట్లు, చైనా జనాభా 142.6 కోట్లు. ఈ సంఖ్యను భారత్ మించిపోతుంది. ఈ విషయాన్ని సోమవారం ప్రపంచ జనాభా దినోత్సవం నేపథ్యంలో తాజా నివేదికను ఉటంకిస్తూ ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ఐరాసకు చెందిన సామాజిక ఆర్థిక వ్యవహారాల సంబంధిత పాపులేషన్ డివిజన్ వివిధ దేశాలు ప్రాంతాలు ఖండాలవారిగా జనాభా అంశాన్ని ప్రస్తావించింది. 1950 నుంచి ప్రపంచ జనాభా నెమ్మదిగా పెరుగుతోంది. 2020లో ఇది ఒక్కశాతం కన్నా తక్కువగా పడిపోయింది. 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లు దాటుతుంది.

నిర్థిష్టంగా చూస్తే ఇది 9.7 బిలియన్‌గా నమోదు కానుంది. ఆతరువాతి క్రమంలో ప్రపంచ జనాభా 2080 నాటికి 10.4 బిలియన్లకు, 2100కు కొంచెం పైస్థాయికి చేరుతుందని వెల్లడైంది. ఈ ఏడాది జనాభా దినోత్సవానికి విశేష ప్రాముఖ్యత ఉంది. జనాభా విషయంలో ఇది ఓ మైలురాయి అవుతుంది. ప్రపంచంలో 800 కోట్ల ప్రాణి జన్మించే సంవత్సరం ఇప్పుడే అవుతుందని, ప్రపంచ స్థాయి వైవిధ్యత, బహుళత్వం. అన్నింటికీ సూత్రబంధంగా ఉమ్మడి మానవీయ బంధం ప్రధానంగా ఈ జనాభా అంశం విశిష్టతను సంతరించుకుంటుందని ఐరాస అధినేత తెలిపారు. భారతదేశం చైనాను జనాభా విషయంలో అధిగమించడం కేవలం సంఖ్యాపరంగా కీలకమే కాకుండా చైనాతో పోలిస్తే తక్కువ భూ విస్తీర్ణపు దేశం కావడంతో జనసాంద్రత విషయంలో కూడా ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంటుంది. ఇక ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చూస్తే రెండు జనసమ్మర్థపు ప్రాంతాలు నమోదు అవుతున్నాయి, తూర్పు, ఆగ్నేయాసియాలలో అత్యధిక జనాభా సమకూరుతుంది.

ఇక్కడ 2.3 బిలియన్ ప్రజలు ఉంటారు. ఈ విధంగా మొత్తం ప్రపంచపు జనాభాలో 29 శాతం ఇక్కడనే ఉంటుంది. సెంట్రల్, దక్షిణ ఆసియాలు కలిపితే 2.1 బిలియన్లు ఉంటుంది . ఇది మొత్తం జనాభాలో 26 శాతంగా రికార్డు అవుతోంది. 2050 నాటికి అత్యధికంగా జనాభా కొన్ని దేశాలలో కేంద్రీకృతం అవుతుంది. ఇండియా , నైజిరియా, పాకిస్థాన్, ఫిలిప్పిన్స్, ఈజిప్టు, టాంజానియా, కాంగో, ఇధియోపియా దేశాలలో జనం సంఖ్యపెరుగుతుంది. ఇండియా జనాభా 2050 నాటికి 166 కోట్లు దాటుతుందని నివేదికలో తెలిపారు. ఈ విధంగా చైనా భారత్ కన్నా ఈ విషయంలో చాలా వెనుకబడుతుందని వెల్లడైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News