Thursday, January 9, 2025

రెండో త్రైమాసికంలో జిడిపి 5.4 శాతానికి పతనం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) నెమ్మదించింది. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 5.4 శాతానికి తగ్గిపోయింది. ప్రభుత్వం ఈ మేరకు డేటాను శుక్రవారం విడుదల చేసింది. 2023-24 రెండో త్రైమాసికంలో జిడిపి 8.1 శాతంగా ఉండింది. అది ఈసారి నెమ్మదించింది.ఇదే విధంగా రియల్ గ్రాస్ వాల్యూ యాడెడ్(జివిఏ) కూడా నెమ్మదించింది. 2023-24  రెండో త్రైమాసికంలో 7.7 శాతం ఉండగా, 2024-25 రెండో త్రైమాసికంలో 5.6 శాతానికి తగ్గిపోయింది.

వ్యవసాయం, పశుసంపద, అడవులు,మత్స్య రంగం రెండింతల వృద్ధి సాధించినప్పటికీ తయారీ రంగం, గనుల శాఖ వృద్ధి కుంటుపడింది. తయారీ రంగం వృద్ధి 14.3 శాతం నుంచి 2.2 శాతానికి పడిపోయింది. ఇక గనులు, క్వారీ రంగాల వృద్ధి రేటు కూడా మైనస్ 0.1 శాతం నమోదయింది. ఇది అంతకు మునుపు సంవత్సరంలొ 11.1 శాతంగా ఉండింది. విద్యుత్తు, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవలు కూడా గణనీయంగా పడిపోయాయి.వినియోగంలో పెద్ద ఎత్తున తగ్గిపోవడం కనిపిస్తోంది. గతంలో 10.4 శాతం ఉంటే ఈ ఏడాది 3.3 శాతం  మాత్రమే ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News