Saturday, November 23, 2024

4 కు చేరిన ‘ఆర్‌నాట్ ’ విలువ.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయికి కేసులు

- Advertisement -
- Advertisement -
India's R-naught value recorded at 4
ఐఐటి మద్రాస్ ప్రాథమిక విశ్లేషణలో వెల్లడి

చెన్నై : దేశంలో కరోనా మూడోవేవ్ ప్రారంభమైనట్టు వైద్య నిపుణులు భావిస్తున్న నేపథ్యంలో గత రెండు వారాల కొవిడ్ కేసులను విశ్లేషించిన ఐఐటి మద్రాస్ బృందం దేశంలో ఆర్‌నాట్ విలువ డిసెంబర్ 25 31మధ్య 2.9 ఉండగా, జనవరి 1 6 మధ్య ఏకంగా 4 గా నమోదైందని తెలియజేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్ధాన్ని ఆర్‌నాట్ విలువగా పరిగణిస్తుంటారు. కంప్యూటేషనల్ మోడలింగ్ ప్రాథమిక విశ్లేషణ ఆధారంగా ఈ వివరాలు తెలియజేసింది. దేశంలో మహమ్మారి రెండో వేవ్ పీక్ దశలో నమోదైన 1.69 కంటే ఇది ఎక్కువ కావడం గమనించదగింది. ఈ విలువ ఒకటి దాటడం ఏమ్రాం సానుకూల పరిణామం కాదని వైద్య నిపుణులు చెబుతుంటారు. కేంద్ర ఆరోగ్యశాఖ కూడా దేశ ఆర్‌నాట్ విలువ 2.69 గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ గత బుధవారం తెలియజేసింది. మరోవైపు దేశంలో ప్రస్తుత వేవ్ ఫిబ్రవరి 115 మధ్య గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఈ బృందం అంచనా వేసింది.

ఐఐటి మద్రాస్ గణిత శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా ఈ విషయమై మాట్లాడుతూ ఆర్‌నాట్ అనేది సంక్రమణ సంభావ్యత, కాంటాక్ట్ రేటు తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అయితే క్వారంటైన్ నిబంధనలు, ఆంక్షల విదింపు కారణంగా కాంటాక్ట్ రేటు తగ్గి, ఆర్‌నాట్ విలువ పడిపోవచ్చని తెలిపారు. ఆర్‌నాట్ విలువ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన దాని కంటే భిన్నంగా ఉండడంపై వివరిస్తూ ఈ రెండు అంచనాలు వేర్వేరు టైం ఇంటర్వెల్‌పై ఆధారపడి ఉన్నాయని, తాము కేవలం గత రెండు వారాలకు సంబంధించిన వివరాలపై ప్రాథమిక విశ్లేషణ చేసినట్టు చెప్పారు. మరోవైపు వ్యాక్సినేషన్ రేటు మొదటి, రెండు వేవ్‌లతో పోల్చితే ఈసారి తక్కువ సామాజిక దూరం పాటిస్తుండటం తదితర కారణాలతో ప్రస్తుత వేవ్ మునుపటి వాటి కంటే భిన్నంగా ఉంటుందని ఝా వెల్లడించారు. ఈసారి జనాభాలో దాదాపు 50 శాతం మందికి టీకాలు పూర్తి కావడం కలిసొచ్చే అంశమని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News