Sunday, January 19, 2025

10 నెలల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

మార్చిలో 4.85 నమోదు
పారిశ్రామిక ఉత్పత్తి శాతానికి పెరుగుదల
ఆహార ద్రవ్యోల్బణం శాతానికి తగ్గుదల

న్యూఢిల్లీ : దేశంలో రీటైల్ ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికపై మార్చిలో 4.85 శాతంగా నమోదైందని, ఇది పది నెలల కనిష్ఠం అని, ఇది ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉందని ప్రభుత్వం విడుదల చేసిన డేటా తెలియజేసింది. రీటైల్ ద్రవ్యోల్బణం 4.91 శాతానికి తగ్గగలదని రాయిటర్స్ ఆర్థికవేత్తలు నిర్వహించిన ఒక పోల్ సూచించింది. ద్రవ్య్లోల్బణం రేటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) సహనం స్థాయి 2-6 శాతంలో పే ఉన్నది. గత నెల తగ్గుదల -0.11 శాతంతో పోలిస్తే ద్రవ్యోల్బణం రేటు తాజా కాలంలో 0.16 శాతానికి పెరిగింది.

కాగా, కేంద్ర అర్థగణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ డేటా ప్రకారం, భారత పారిశ్రామిక ఉత్పత్తి నాలుగు నెలల గరిష్ఠానికి 5.7 శాతానికి చేరింది. గత నెల లో పారిశ్రామిక ఉత్పత్తి 4.2 శాతంగా ఉన్నది. మొత్తంగా వినియోగదారు ధరల సూచిలో సుమారు సగం మేర ఉండే ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 8.52 శాతం మేర పెరిగింది. ఫిబ్రవరిలోని పెరుగుదల 8.66 శాతం కన్నా ఇది స్వల్పంగా మాత్రమే తక్కువ. ఇంధన ధరలు ఏడాది ప్రాతిపదికపై మార్చిలో 3.2 శాతం మేర క్షీణించాయి. ఫిబ్రవరిలో వాటి ధరలు 0.77 శాతం మేర తగ్గాయి. కాగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేట్లు వరుసగా 5.45 శాతం, 4.14 శాతం మేర ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News