Friday, November 15, 2024

ఫిబ్రవరిలో 6.07 శాతానికి పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం

- Advertisement -
- Advertisement -

CPI
న్యూఢిల్లీ: భారత వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) ద్రవ్యోల్బణ రేటు ఫిబ్రవరి 2022 నాటికి 6.07 శాతానికి పెరిగింది. ఇది భారత రిజర్వు బ్యాంకు నిర్దేశించిన థ్రెషోల్డ్ 6 శాతానికి మించింది. ఈ విషయాన్ని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన డేటాలో తెలిపింది. జనవరిలో సిపిఐ ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6.01 శాతంగా ఉంది.
సిపిఐ డేటా ఆర్‌బిఐ ఎగువ మార్జిన్ 6 శాతం కంటే పెరుగడం ఇది వరుసగా రెండోసారి. 2026తో ముగిసే ఐదేళ్ల కాలానికి ఇరువైపుల 2 శాతం మార్జిన్‌తో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కొనసాగించాలని ప్రభుత్వ కేంద్ర బ్యాంకు ఆదేశించింది. ఆర్‌బిఐ తన ద్విమాసిక ద్రవ్య విధానాన్ని రూపొందించేప్పుడు వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) డేటాను ప్రధానంగా పరిగణిస్తారు. గత నెల కేంద్ర బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపిసి) రెపో రేటును వరుసగా పదోసారి 4 శాతం వద్ద యథాతథంగా ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News