Thursday, January 23, 2025

40 శాతం సంపద ఒక్క శాతం భారతీయుల వద్ద కేంద్రీకృతం!

- Advertisement -
- Advertisement -

డావోస్: భారత దేశంలో ఒక్క శాతం సంపన్నుల చేతుల్లో 40 శాతం ఆస్తులు ఉన్నాయని, కాగా జనాభాలో 3 శాతం సంపదయే కింది స్థాయి ప్రజల్లో ఉందని ఓ నూతన అధ్యయనంలో వెల్లడయింది. భారతీయుల అసమానతలపై రైట్స్ గ్రూప్ ‘ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్’ వివరణ ఇస్తూ భారతీయ సంపన్నులపై 5 శాతం పన్ను విధించినా అది పిల్లలంతా తిరిగి పాఠశాలకు వచ్చేలా చేయగలదని పేర్కొంది. ‘కేవలం ఒక బిలియనీర్ గౌతమ్ అదానీపై 20172021 అవాస్తవిక లాభాలపై పన్ను విధించినా రూ. 1.79 లక్షల కోట్లు సమీకరించవచ్చు, ఇది సంవత్సరానికి ఐదు మిలియన్లకుపైగా భారతీయ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను నియమించడానికి సరిపోతుంది’ అని పేర్కొంది.

‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, భారతదేశంలోని బిలియనీర్ల మొత్తం సంపదపై 2 శాతం పన్ను విధించినా, రాబోయే మూడేళ్లలో దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి పోషకాహారం కోసం రూ. 40423 కోట్లు వెచ్చించవచ్చు’ అని ఆ నివేదిక పేర్కొంది. ‘దేశంలోని 10 మంది బిలియనీర్ల(రూ. 1.37 లక్షల కోట్లు)పై ఒకేసారి 5 శాతం పన్ను విధిస్తే అది ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (రూ. 86200 కోట్లు), ఆయూష్ మంత్రిత్వ శాఖ (రూ. 86200 కోట్లు) అంచనా వేసిన నిధుల కంటే 1.5 రెట్లు ఎక్కువ ఉంటుంది. 202223 సంవత్సరానికి రూ. 3500 కోట్లు’ అని పేర్కొంది.

ఇక స్త్రీపురుష అసమానతల గురించి పేర్కొంటూ… పురుషుడు రూ. 1 సంపాదిస్తే, మహిళ కేవలం 63 పైసలు మాత్రమే సంపాదిస్తోందని పేర్కొంది. ‘టాప్ 100 భారతీయ బిలియనీర్లపై 2.5 శాతం పన్ను విధించినా లేక టాప్ 10 మంది భారతీయ బిలియనీర్లపై 5 శాతం పన్ను విధించినా పిల్లలను తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు సరిపోతుంది’ అని పేర్కొంది.
భారత్‌లో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి 2022 నవంబర్ వరకు భారత దేశంలోని బిలియనీర్ల సంపద 121 శాతం లేదా రోజుకు రూ. 3608 కోట్లు పెరిగిందని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. భారత్‌లో 2020లో 102 మంది బిలియనీర్లు ఉండగా 2022 నాటికి వారి సంఖ్య 166కి పెరిగిందని తెలిపింది. భారత దేశంలోని 100 మంది ధనవంతుల మొత్తం సంపద 660 బిలియన్ల డాలర్లకు(రూ. 54.12 లక్షల కోట్లు) చేరుకుంది. ఇది మొత్తం కేంద్ర బడ్జెట్‌కు 18 నెలలకు పైగా నిధులు సమకూర్చగలదని తెలిపింది.

ఆక్స్‌ఫామ్ ఇండియా సిఈవో అమితాబ్ బెహర్ ‘దేశంలోని అట్టడుగున ఉన్న దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలు, అనధికారిక రంగా కార్మికులు దేశంలో అత్యంత ధనవంతుల మనుగడకు భరోసానిచ్చే వ్యవస్థలో కష్టాలను అనుభవిస్తున్నారు’ అని పేర్కొంది. సంక్షోభ లాభదాయకతను అంతం చేయడానికి ఏకీకృత సంపద పన్నులు, విండ్‌ఫాల్ పన్నులను ప్రవేశపెట్టాలని ఆక్స్‌ఫామ్ ఇండియా కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. సంపన్నులపై 1 శాతం పన్నును శాశ్వతంగా పెంచాలని, మూలధన లాభాలపై పన్నులను పెంచాలని డిమాండ్ చేసింది. వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం అందేలా చూడాలని ఆక్స్‌ఫామ్ ఇండియా కోరింది. హుందాగా బతికేందుకు సరిపడేలా కనీస వేతనాలు ఉండేలా చూడాలంది.

Oxfam Report

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News