Sunday, December 22, 2024

నేడు సౌతాఫ్రికాతో భారత్ రెండో టీ20 మ్యాచ్..

- Advertisement -
- Advertisement -

సౌతాఫ్రికా మహిళలతో ఆదివారం జరిగే రెండో టి20 మ్యాచ్ భారత్‌కు సవాల్‌గా మారింది. తొలి టి20లో సౌతాఫ్రికా చేతిలో భారత మహిళలు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం జరిగే పోరులో ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లు ఇరు జట్లలోనూ ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది.

సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి భారత్‌కు నెలకొంది. సౌతాఫ్రికా టీమ్‌లో వల్‌వర్డ్, తంజీమ్ బ్రిట్స్, మరిజానె కాప్‌లు ఫామ్‌లో ఉన్నారు. తొలి టి20లో వీరు మెరుగైన ప్రదర్శనతో అలరించారు. ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. భారత్‌లో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. మంధాన, షెఫాలీ, రోడ్రిగ్స్, హర్మన్ తదితరులు తమ మార్క్ ఆటతో రాణిస్తే భారత్‌కు విజయం కష్టమేమీ కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News