- Advertisement -
గ్లాస్గో: భారత సౌర విద్యుత్తు సామర్థ్యం ప్రస్తుతం 45 గిగావాట్స్‌గా ఉందని ఆదివారం ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో భారత్ తెలిపింది. గత 7 ఏళ్లలో మన సౌర విద్యుత్తు సామర్థ్యం 17 రెట్లు పెరిగిందని పేర్కొంది. భారత్ తన మూడో బైఎన్నియల్ అప్‌డేట్ రిపోర్ట్(బియూఆర్)ను కాప్ 26 వాతావరణ సదస్సులో 11వ ఫెసిలేటేటివ్ షేరింగ్ ఆఫ్ వ్యూస్(ఎఫ్‌ఎస్‌వి) కింద సమర్పించింది. భారత 3వ బియూఆర్ కింద కర్బనపు ఉద్గారాలను 24 శాతం తగ్గించడం జరిగింది. 2005-14 నుంచి భారత్ సౌరవిద్యుత్తును గణనీయంగా పెంచింది. భారత్ తరఫున పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహాదారు/శాస్త్రవేత్త జెఆర్ భట్ ఈ ప్రకటన చేశారు.
- Advertisement -