Monday, December 23, 2024

మొహాలీ టెస్టులో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

India's solid victory in the Mohali Test

మొహాలీ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో ఇన్నింగ్స్ లో 178 పరుగులకే లంక కుప్పకూలింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఈ ఇన్నింగ్స్ లో జడేజా, అశ్విన్ కు చెరో 4 వికెట్లు, షమీ 2 వికెట్లు తీశారు. మొహాలి టెస్టు మూడు రోజులకే ముగిసింది. రెండు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది టీమిండియా. రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ పదర్శనతో ఆకట్టుకున్నాడు. జడేజా బ్యాటు, బంతితో సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్ లో 175 పరుగులతో అజేయంగా జడేజా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్ లలో కలిసి 9 వికెట్లు పడగొట్టాడు జడేజా. స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్ – 574/8 డిక్లేర్డ్. శ్రీలంక: తొలిఇన్నింగ్స్ 174, రెండో ఇన్నింగ్స్ 178. ఈ నెల 12 నుంచి బెంగళూరులో రెండో టెస్టు (డే/నైట్) మ్యాచ్ ఆరంభంకానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News