బంగ్లాదేశ్ తో జరగనున్న టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ముత్తం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే, వైస్ కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేయలేదు. ప్రస్తుత టెస్టు జట్టులోని ఆటగాళ్లతోపాటు అక్టోబర్ 1-5 తేదీల్లో లక్నోలో జరగనున్న ఇరానీ కప్‌లో ఆడబోయే వారిని కూడా ఎంపిక చేయలేదు.దాదాపు యువ ఆటగాళ్లనే సెలెక్ట్ చేశారు.
IPLలో గత రెండు సీజన్‌లలో అద్భుతంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తితోపాటు IPL సంచలనం మయాంక్ యాదవ్, జితేష్ శర్మ, డ్యాషింగ్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ జట్టులో చోటు దక్కింది. హర్షిత్ రానా ఈ సిరీస్ తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక, గాయం కారణంగా జింబాబ్వే టూర్‌కు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి కూడా బంగ్లాదేశ్ సిరీస్‌కు తిరిగి వచ్చాడు. కాగా.. అక్టోబరు 6వ తేదీ ఆదివారం గ్వాలియర్‌లో ప్రారంభమయ్యే మ్యాచ్ తో బంగ్లాదేశ్‌తో T20I సిరీస్ ప్రారంభం కానుంది.
భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (సి), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికె), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, జితేష్ శర్మ ( wk), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్