Monday, January 20, 2025

చరిత్ర సృష్టించిన దీపా కర్మాకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది. ఉబ్జెకిస్థాన్ వేదికగా జరిగిన ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దీపా వ్యక్తిగత వాల్ట్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో ఆసియా స్థాయి క్రీడల్లో స్వర్ణం గెలుచుకున్న తొలి భారత జిమ్నాస్ట్‌గా నయా రికార్డును నెలకొల్పింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపా 13.566 సగటును నమోదు చేసి ప్రథమ స్థానంలో నిలిచింది.

ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సన్ హ్యాంగ్ రజతం, జో క్యోగ్ కాంస్యం సాధించారు. కాగా ఈ టోర్నీలో దీపా కర్మాకర్ ఆరంభం నుంచే అద్భుత ఆటను కనబరిచింది. ఫైనల్లో 8 మంది జిమ్నాస్ట్‌లు తలపడ్డారు. ఇందులో పూర్తి ఆధిపత్యం చెలాయించిన దీపా తన ఖాతాలో పసిడి పతకాన్ని జత చేసుకుంది. మరోవైపు ఆసియా జిమ్నాస్టిక్స్‌లో ఇంతకుముందు ఏ భారత జిమ్నాస్ట్ కూడా స్వర్ణం సాధించలేదు. అయితే 30 ఏళ్ల దీపా కర్మాకర్ అసాధారణ ఆటతో పసిడి పతకం సాధించి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News