Friday, January 24, 2025

ఆగస్టులో 89.6 శాతంకు పెరిగిన సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి

- Advertisement -
- Advertisement -

 

Sunflower Oil import

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభంలో చిక్కుకున్న తర్వాత భారత్ వంట నూనెల దిగుమతి ఎక్కువగా రష్యా, అర్జెంటీనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. కాగా ఆగస్టు నెలలో వంటనూనె దిగుమతి 89.6 శాతానికి పెరిగిందని ‘సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్’ పేర్కొంది. ప్రపంచంలో భారత్ వంట నూనెను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశంగా ఉంది. అత్యధికంగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌నే దిగుమతి చేసుకుంటుంటుంది. అది మొత్తం వంటనూనె దిగుమతిలో 16 శాతం ఉంటుంది. రష్యాఉక్రెయిన్ సంక్షోభం తలెత్తక ముందు భారత్ ఉక్రెయిన్ నుంచే పెద్ద మొత్తంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకునేది. ఉక్రెయిన్ నుంచి 70 శాతం దిగుమతి చేసుకుంటే, రష్యా నుంచి 20 శాతం దిగుమతి చేసుకునేది. కానీ ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేశాక సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి బాగా దెబ్బతిన్నది. ప్రస్తుతం రష్యా, అర్జెంటీనా నుంచి ఎక్కువ మొత్తంలో భారత్ దిగుమతి చేసుకుంటోంది. టర్కీ నుంచి కూడా భారత్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కొద్దిగా దిగుమతి చేసుకుంటోంది. ఆగస్టులో రష్యా నుంచి భారత్ 135000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. కాగా అర్జెంటీనా నుంచి 30600 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. టర్కీ నుంచి 14588 టన్నులు దిగుమతి చేసుకుంది. భారత్ పామాయిల్‌ను కూడా బాగానే దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్ ఆయిల్‌ను కూడా 2.44 టన్నులు భారత్ దిగుమతి చేసుకుంది. భారత్ వాడే వంటనూనెలలో 12 శాతం మేరకు పామాయిల్ ఉంటోంది. భారత్ పామాయిల్‌ను ప్రధానంగా ఇండోనేషియా, మలేషియాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. సోయాబీన్ ఆయిల్‌ను అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News