Monday, December 23, 2024

ఎస్పిలోకి దేశంలోనే అత్యంత పొడగరి వ్యక్తి..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత పొడగరి వ్యక్తిగా గుర్తింపు పొందిన యూపీకి చెందిన ధర్మేంద్ర ప్రతాప్ సింగ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ పటేల్ ఆయనను పార్టీ లోకి ఆహ్వానించారు. ధర్మేంద్ర ప్రతాప్ రాకతో రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఈ సందర్భంగా నరేశ్ విశ్వాసం వెలిబుచ్చారు.సమాజ్ వాది విధానాలు నచ్చి ఆయన చేరారని, పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఏ పార్టీతో సంబంధం లేని ధర్మేంద్ర తొలిసారి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. పొడవైన వ్యక్తిగా ఆయనకున్న క్రేజ్‌ను సమాజ్ వాదీ పార్టీ కూడా ప్రచారం లో వినియోగించుకోవాలని భావిస్తోంది. ప్రతాప్ సింగ్ పొడవు 8 అడుగులు 1 అంగుళం. ప్రపంచ రికార్డు కలిగిన వ్యక్తి కంటే 11 సెంటీ మీటర్లు తక్కువ పొడవు ఉన్న ప్రతాప్ సింగ్ దేశం లోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇదిలా ఉండగా పార్టీ అధినేత అఖిలేశ్‌తో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల అయ్యాయి.

India’s tallest man joins SP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News