Wednesday, January 22, 2025

ముంబైలో ‘ఇండియా’ మూడో భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రతిపక్ష కూటమి ఇండియా తదుపరి సమావేశం ముంబైలో ఆగస్టు 25, 26 తేదీలలో జరుగుతుంది. ఐక్యత, బిజెపితో లోక్‌సభ ఎన్నికలలో తలపడే దిశలో విపక్షాలు ఇంతకు ముందు రెండుసార్లు సమావేశం అయ్యాయి. ఇప్పుడు మూడో దఫా భేటి ముంబైలో జరుగుతుంది. 26 రాజకీయ పార్టీల ఉమ్మడి కూటమిగా బెంగళూరు సభలో ఇండియా అవతరించింది. మూడో దఫా భేటీ ఆగస్టు 15 తరువాత ఎప్పుడైనా కానీ లేదా సెప్టెంబర్ తొలివారంలోకానీ జరుగుతుందని కొన్ని రాజకీయ పార్టీల నేతలు తెలిపారు. అయితే ఈ తేదీ 25, 26గా ఖరారు అయిందని నిర్థారణ అయింది.

కలిసి ఉంటే నిలుస్తాం గెలుస్తాం అనే ప్రధాన నినాదంతో ఇండియా కూటమి వెలుగులోకి వచ్చింది, ఇంతకు ముందు ఇండియా కూటమి భేటీ కర్నాటకలోని బెంగళూరులో జులై 17, 18 తేదీలలో జరిగింది. ముంబైలో ఇండియా సమావేశం ఏర్పాటు అంశం గురించి కాంగ్రెస్ నేత నానా పటోలే ఎన్‌సిపి అధినేత శరద్ పవార్‌తో చర్చించారు. సెప్టెంబర్ తొలివారంలో సమావేశం బాగుంటుందని తమ పార్టీ తరఫున ప్రతిపాదించినట్లు కాంగ్రెస్ నేత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News