Monday, December 23, 2024

85 శాతం పెరిగిన భారత టిడబ్ల్యుఎస్ ఎగుమతి!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత దేశపు టిడబ్ల్యుఎస్ (ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్) ఎగుమతి 2022లో 85 శాతం(సంవత్సరానికి) వృద్ధిని నమోదు చేశాయి. ‘బోట్’ కంపెనీ వరుసగా మూడోసారి మార్కెట్‌లో అగ్రగామిగా ఉందని మంగళవారం తాజా నివేదిక వెల్లడించింది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం ‘బోట్’ 89 శాతం(సంవత్సరానికి) వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతుల్లో ఐదింట రెండు వంతుల వాటాను అందించింది. టిడబ్ల్యుఎస్ మార్కెట్‌లో ఎయిర్‌డోప్స్131 ఎగుమతి 10 శాతం వాటాతో వరుసగా రెండో సంవత్సరం అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్‌గా నిలిచింది. అంతేకాకుండా టిడబ్ల్యుఎస్ మార్కెట్‌లో స్థానిక బ్రాండ్‌లు టాప్ ఐదు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

‘వన్ ప్లస్ ఫీచర్‌రిచ్ పరికరాలైన నార్డ్ బడ్స్, నార్డ్ బడ్స్ సిఈ చక్కని పనితీరుతో చైనా బ్రాండ్‌లు 13 శాతం వాటాను పొందాయి. చైనా బ్రాండ్‌లు వృద్ధి సాధించడానికి రియల్‌మీ, ఒప్పో బాగా మద్దతునిచ్చాయి. ఇక గ్లోబల్ బ్రాండ్‌లైన యాపిల్, శాంసంగ్, జెబిఎన్ ఎనిమిది శాతం వాటాను కైవసం చేసుకున్నాయి’ అని సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు అన్షిక జైన్ తెలిపారు.
టిడబ్ల్యుఎస్  ఎగుమతుల్లో ‘బోట్’ ప్రథమ స్థానంలో ఉంటే ‘నాయిస్’ ద్వితీయ స్థానంలో నిలిచింది. కాగా ‘బౌల్ట్ ఆడియో’ మూడో స్థానంలో నిలిచింది. ‘మివీ’ నాలుగో స్థానంలో నిలిచింది. పిట్రోన్ ఐదో స్థానంలో ఉంది. దేశీయ బ్రాండ్‌లైన బోట్, మివీ, పిట్రోన్ తమ స్థానిక ఉత్పత్తిని 73 శాతం మేరకు పెంచాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News