Monday, December 23, 2024

హాకీలో భారత్ కు కాంస్యం

- Advertisement -
- Advertisement -

 

India won bronze in Hokey

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు  న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 2-1తో విజయం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన సెమీ ఫైనల్‌లో మ్యాచ్‌లో అంపైర్ వివాదాస్పద నిర్ణయం కారణంగా ఫైనల్స్‌కు చేరుకోలేకపోయిన భారత మహిళల హాకీ జట్టు నేడు(ఆదివారం) స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అభిమానుల మనసులు దోచుకుంది.

గేమ్ మరికాసేపట్లో ముగుస్తుందనగా గోల్ చేసి న్యూజిలాండ్ స్కోర్‌ను సమం చేసింది. దీంతో పెనాల్టీ షూటవుట్ తప్పలేదు. ఇందులో న్యూజిలాండ్ ఒకే ఒక్క గోల్ సాధించగా, భారత్ రెండు గోల్స్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. కామన్వెల్త్ గేమ్స్‌ హాకీలో భారత్‌కు ఇది మూడో పతకం కాగా, చివరిసారి  2006లో పతకం సాధించింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పతకం సాధించి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News