Monday, December 23, 2024

లోక్‌సభ ఎన్నికల్లో భారత్ ప్రపంచ రికార్డు

- Advertisement -
- Advertisement -

64.2 కోట్ల మంది వోటు వేశారు
వారిలో 31.2 కోట్ల మంది మహిళలు
సిఇసి రాజీవ్ కుమార్

న్యూఢిల్లీ : ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది వోటర్లతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించిందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. వారిలో 31.2 మంది మహిళా వోటర్లు అని ఆయన తెలిపారు. రాజీవ్ కుమార్ విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియలో 68 వేల పర్యవేక్షణ బృందాలు, ఒకటిన్నర కోట్ల మంది పోలింగ్, భద్రత సిబ్బంది పాల్గొన్నట్లు తెలియజేశారు. ‘ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో 31.2 కోట్ల మంది మహిళలతో సహా 64.2 కోట్ల మంది వోటర్లు పాల్గొనడంతో భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది’ అని సిఇసి తెలిపారు. ఎన్నికల కమిషనర్లను ‘లాపతా జెంటిల్‌మెన్’గా పేర్కొన్న సామాజిక మాధ్యమ మీమ్స్‌ను రాజీవ్ కుమార్ ప్రస్తావిస్తూ, ‘మేము ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నాం. ఎన్నడూ అదృశ్యం కాలేదు’ అని స్పష్టం చేశారు.

“లాపతా జెంటిల్‌మెన్’ తిరిగి వచ్చారు అని ఇప్పుడు మీమ్స్ అనవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం సుమారు నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1692 వైమానిక సార్టీలను ఉపయోగించినట్లు సిఇసి చెప్పారు. ‘2019 సార్వత్రిక ఎన్నికల్లో 540 రీపోల్స్ నిర్వహించగా 2024 ఎన్నికల్లో వాటి సంఖ్య 39 మాత్రమే’ అని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ మొత్తంగా 58.58 శాతంతో, లోయలో 51.05 శాతంతో నాలుగు దశాబ్దాలలోనే అత్యధిక పోలింగ్‌ను నమోదు చేసిందని కూడా సిఇసి తెలియజేశారు. ‘2024 ఎన్నికల్లో నగదు, ఉచితాలు, మాదకద్రవ్యాలు, మద్యంతో సహా రూ. 10 వేల కోట్ల విలువ మేరకు స్వాధీనం చేసుకున్నాం. 2019లో రూ. 3500 కోట్లు విలువ మేరకు స్వాధీనం చేసుకోవడమైంది’ అని రాజీవ్ కుమార్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News