యాసంగిలో సాగు, తాగునీటికి ఎంత ఇండెంట్ ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: యాసంగి సీజన్‌లో నీటి అవసరాలు తెలపాలని కృష్ణానదీయాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలను కో రింది. యాసంగి సీజన్‌లో తాగునీటికి , పం టల సాగుకు ఎంత నీరు అవసరమో ఇండెం ట్ ఇవ్వాలని తెలిపింది. కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శి డిఎం రాయపురే తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖలకు ఈ మేరకు లేఖలు రాశారు. అంతేకాకుండా 2021జూన్ నుంచి ప్రారంభమైన నీటి ఖరీఫ్ పంటలకు రెండు రా ్రష్ట్రాలు ఎంత నీటిని వినియోగించుకున్నది కూడా వివరాలు సోమవారం నాటికి అందజేయాలని కోరారు. ఫిబ్రవరి 1న జరిగే కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో అన్ని అంశాలు చర్చించి శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర కృష్ణానదీ పరివాహక ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను బట్టి రెండు రాష్ట్రాలకు యాసంగి నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకోనున్నట్టు రాయపురే లేఖ ద్వారా రెండు రాష్ట్రాలకు స్పష్టం చేశారు.