ముంబై : మూడు రోజులుగా నష్టాల్లో ముగుస్తు న్న దేశీయ స్టాక్ మార్కెట్ ట్రెండ్‌కు నేడు బ్రేక్ పడింది. మార్కెట్ ముగిసే సమయానికి షార్ట్ కవరింగ్ కనిపించింది. కొనుగోళ్లు బలంగా జరిగాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503.27 పాయింట్లు లేక 0.94 శాతం పెరిగి 54,252.53 వద్ద, అలాగే నిఫ్టీ 144.40 పాయింట్లు లేక 0.90 శాతం పెరిగి 16,170.20 వద్ద ముగిసింది. దాదాపు 1712 షేర్లు పెరుగగా, 1509 షేర్లు నష్టపోయాయి. కాగా 126 షేర్లు ఎలాంటి మార్పులేకుండా నిలిచాయి. నిఫ్టీలో లాంగ్ లెగ్ ఫార్మేషన్ రూపొందింది. అంటే మార్కెట్ ఇక్కడి నుంచి మరింత పైకే వెళుతుందని సంకేతం.
నిఫ్టీలో టాటా స్టీల్, జెఎస్ డబ్లు స్టీల్, అపోలో హాస్పిటల్, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభపడగా- ఐటిసి, యూపిఎల్, డివీస్ లాబ్స్, సన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. ఇక సెక్టారువైజ్‌గా మెటల్, ఐటి, పవర్, రియాలిటీ, బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ 1 నుంచి 3 శాతం మేరకు పెరిగాయి. కాగా బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.78 శాతం పెరిగింది.
అటు డాలరు మారకంలో రూపాయి గురువారం పాజిటివ్‌గా ముగిసింది. నిన్నటి ముగింపుతో పోలిస్తే 3 పైసలు ఎగిసి రూ. 77.54 వద్ద క్లోజ్ అయింది.