Wednesday, January 22, 2025

ఇండిగో విమానంలో నటి పూజా హెగ్డేకు చేదనుభవం!

- Advertisement -
- Advertisement -

Puja Hegde

హైదరాబాద్:  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలుపుతూ. ఇండిగో సిబ్బంది తీరుపై పూజా మండిపడింది.

‘IndiGo6E స్టాఫ్ మెంబర్  దురుసుగా ప్రవర్తించినందుకు చాలా విచారంగా ఉంది. సిబ్బంది, విపుల్ నకాషే(Vipul Nakashe) అనే వ్యక్తి ఈ రోజు ముంబై నుండి బయలుదేరిన మా విమానంలో మాతో అమర్యాదగా ప్రవర్తించాడు. ఎటువంటి కారణం లేకుండా మాతో పూర్తిగా అహంకారం, అజ్ఞానం, బెదిరింపు ధోరణితో వ్యవహరించాడు. సాధారణంగా నేను ఈ సమస్యల గురించి ట్వీట్ చేయను, కానీ ఇది నిజంగా భయంకరంగా ఉంది’ అంటూ పూజా ట్వీట్ చేసింది. దాంతో ఇండిగో ఎయిర్ లైన్స్ వారి తీరుపై నెటిజెన్స్ సైతం మండి పడుతున్నారు.

పూజా ఫిర్యాదులపై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. వారి ప్రత్యుత్తరం ఇలా ఉంది, “శ్రీమతి హెగ్డే, మీ చేదు అనుభవానికి  క్షమించండి. మేము మీతో వెంటనే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాము, దయచేసి సంప్రదింపు నంబర్‌తో పాటు మీ PNRని మాకు DM చేయండి. ~Linda (sic).”

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News