Monday, December 23, 2024

పాకిస్థాన్ లోకి వెళ్లిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : అమృత్‌సర్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ లోని లాహోర్ సమీపం వరకు వెళ్లి తిరిగి భారత గగనతలం లోకి ప్రవేశించింది. అలా తిరిగి వచ్చే ముందు పాకిస్థాన్ లోని గుజ్రాన్ వాలా వరకు వె ళ్లిందని పాక్ మీడియా ఆదివారం వెల్లడించింది. ఫ్లైట్ రాడార్ ప్రకారం 454 నాట్ల వేగంతో భార త విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు లాహోర్ ఉత్తర దిశగా ప్రయాణించి, రాత్రి 8.01 గంటలకు భారత దేశానికి తిరిగి వెళ్లినట్టు డాన్ వార్తాపత్రిక వెల్లడించింది. అయితే దీనిపై ఎయిర్‌లైన్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. ఇది అసాధారణ సంఘటనేం కాదని, వా తావరణ పరిస్థితులు సరిగ్గా లేనప్పుడు అంతర్జాతీయంగా ఇలా ప్రవేశించడానికి వీలుంటుందని సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ)సీనియర్ అధికారి చెప్పారు.

శనివారం రాత్రి వాతావరణం బాగా లేకనే విజిబిలిటీ సరిగ్గా లేక అనేక విమానాలను లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు మళ్లించారు. లాహోర్ లోని అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో విజిబిలిటీ 5000 మీ టర్ల వరకే ఉండడంతో లాహోర్‌లో శనివారం రాత్రి 11.30 వరకు వాతావరణ హెచ్చరికలు పొడిగించారని సివిల్ ఏవియేషన్ అధికారి ఒకరు తెలిపారు. గత మే నెలలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానం పాక్‌లో భారీ వర్షాల కారణంగా భారత గగనతలం లోకి ప్రవేశించి దాదాపు 10 నిమిషాలు ఆగింది. పికె 248 అనే విమానం మే 4ప మస్కట్ నుంచి లాహోర్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం లోకి దిగే సమయంలో భారీ వర్షం కారణంగా పైలట్ ల్యాండింగ్ చేయలేక పోయారు. విజిబిలిటీ సరిగ్గా లేక బోయింగ్ 777 విమానం భారత గగనతలం లోకి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News