Monday, November 25, 2024

ఢాకాకు విమాన సర్వీసులు రద్దు

- Advertisement -
- Advertisement -

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా మంగళవారం ఉదయం ఢాకాకు వెళ్లే విమాన సర్వీసును రద్దు చేసింది. ఉద్యోగాలలో కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర స్థాయిలో నిరసనలు పెల్లుబుకిన దరిమిలా ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను అనేక ఎయిర్‌లైన్ సంస్థలు రద్దు చేశాయి. ఇండిగో, ఎయిర్ విస్తారా కూడా మంగళవారం

ఢాకాకు తమ సర్వీసులను నిలిపివేసినట్లు ఆ రెండు సంస్థల అధికారులు తెలిపారు. ముంబై నుంచి ఢాకాకు ప్రతిరోజు, ఢిల్లీ నుంచి వారానికి మూడు విమాన సర్వీసులను విస్తారా ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. మంగళవారం ఉదయం ఢాకాకు తమ విమాన సర్వీసను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం కూడా ఒక విమాన సర్వీసను ఢాకాకు ఎయిర్ ఇండియా నడుపుతోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితిని బట్టి విమాన సర్వీసులను నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటామని అధికారి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News