- Advertisement -
హైదరాబాద్: గోవాలో ఇండిగో విమానయాన సంస్థ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని మంచు లక్ష్మీ తెలిపారు. తనకెళ్లదుట తన బ్యాగ్‌కు సెక్యూరిటీ సిబ్బంది ట్యాగ్ కూడా వేయలేదని, వస్తువులు మిస్ అయితే సంస్థ బాధ్యత తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. తన లగేజ్ బ్యాగ్‌ను పక్కకు తోసేశారని, బ్యాగ్ ఓపెన్ చేయడానికి అనుమతించలేదని మండిపడ్డారు. తనతో పాటు మరికొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. సిబ్బంది చెప్పిన విధంగా చేయకపోతే గోవాలోనే తన సామానును వదిలేస్తామని బెదిరించారన్నారు. సిబ్బంది దురుసుగా వ్యవహరించడం ఇదో రకమైన వేధింపు అని అభిప్రాయం వెల్లడించారు. ఇండిగో విమానయాన సంస్థకు తాను దూరంగా ఉంటానని వివరణ ఇచ్చారు.
- Advertisement -