- Advertisement -
న్యూఢిల్లీ : బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు ముందు వరుస సీట్ల చార్జీలను రూ.2000 వరకు పెంచనుంది. అయితే విమాన ఇంధనం ధరలు తగ్గడంతో ప్రయాణం చౌకగా మారుతుందని కొద్దిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ వీటి విరుద్ధంగా ఇండిగో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన కొన్ని సీట్ల చార్జీలను పెంచాలని నిర్ణయించింది. లెగ్‌రూమ్‌తో ఎక్స్‌ఎల్ సీటు ఉన్న చోట ప్రయాణీకులు ముందు సీటు కోసం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్‌లైన్స్ ఎ320 లేదా ఎ320 నియో ఎయిర్‌క్రాఫ్ట్‌లోని 180 లేదా 186 సీట్లలో 18 ముందు భాగంలో ఎక్స్‌ఎల్ సీట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రయాణీకులు ఈ విండో సీటు కోసం రూ. 2000 అదనంగా చెల్లించాలి. ముందు మధ్య సీటు కోసం రూ. 1,500 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
- Advertisement -