Monday, December 23, 2024

ఇండిగోకు రూ.30లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గత నెలలో అహ్మదాబాద్‌లో టెయిల్ స్ట్రైక్ చేసినందుకు ఎయిర్ క్యారియర్ నుండి ఇద్దరు పైలట్‌లను సస్పెండ్ చేసిన ఒక రోజు తర్వాత, 6 నెలల్లో నమోదైన 4 టెయిల్ స్ట్రైక్స్ కోసం ఇండిగోకు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇండిగో ఎయిర్‌లైన్ తరచుగా టెయిల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ఏవియేషన్ రెగ్యులేటర్ ప్రత్యేక ఆడిట్ నిర్వహించి జరిమానా విధించింది. డీజీసీఏ తన ప్రత్యేక ఆడిట్‌లో, ఇండిగో ఎయిర్‌లైన్ డాక్యుమెంటేషన్, కార్యకలాపాలు, శిక్షణ, ఇంజనీరింగ్ కార్యక్రమాలపై విధానాన్ని సమీక్షించింది.

ప్రత్యేక ఆడిట్ సమయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు, శిక్షణా విధానాలు, ఇంజనీరింగ్ విధానాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌లో కొన్ని వ్యవస్థాగత లోపాలు గమనించబడ్డాయని సీనియర్ డీజీసీఏ అధికారి శుక్రవారం తెలిపారు. ఆడిట్ తర్వాత ఏవియేషన్ రెగ్యులేటర్ ఇండిగోకు షోకాజ్ నోటీసు జారీ చేసి, నిర్ణీత గడువులోగా ప్రత్యుత్తరాన్ని సమర్పించాలని ఆదేశించినట్లు అధికారి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News