Tuesday, November 5, 2024

దివ్యాంగ బాలుడిని అడ్డుకున్న ఇండిగోకు రూ.5 లక్షల జరిమానా

- Advertisement -
- Advertisement -

Indigo fined Rs 5 lakh for obstructing Divyanga boy

న్యూఢిల్లీ : రాంచీ విమానాశ్రయంలో దివ్యాంగ బాలుడిని విమానం ఎక్కించేందుకు అనుమతించకుండా అడ్డుకున్న ఇండిగో ఎయిర్ లైన్స్ పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చర్యలు తీసుకుంది. ఆ బాలుడి పట్ల విమానయాన సంస్థ క్షేత్రస్థాయి సిబ్బంది అనుచితంగా ప్రవర్తించినట్టు నిర్దారించి రూ. 5 లక్షల జరిమానా విధించింది. బాలుడిపై మరింత దయతో ప్రవర్తించి ఉంటే బోర్డింగ్ నిరాకరణకు దారి తీసే పరిస్థితి ఏర్పడేది కాదని డీజీసీఎ పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల్లో మరింత అసాధారణంగా స్పందించాల్సిన ఎయిర్‌లైన్ సిబ్బంది సందర్భానికి అనుగుణంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని ఎండగట్టింది. కాబట్టి విమానయాన సంస్థపై రూ. 5 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు సవరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. హైదరాబాద్ వెళ్లేందుకు దివ్యాంగ కుమారుడితో కలిసి రాంచీ విమానాశ్రయానికి కుటుంబాన్ని ఇండిగో విమాన సిబ్బంది అడ్డుకున్నారు.

బాలుడు భయపడుతున్నాడని, అతడి వల్ల తోటి ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉందని, కాబట్టి బోర్డింగ్‌కు అనుమతించబోమని తేల్చి చెప్పారు. అబ్బాయి తల్లిదండ్రులు వారితో వాగ్వివాదానికి దిగినా ఫలితం లేకుండా పోయింది. మనీషా గుప్తా అనే ప్రయాణికురాలు ఈ ఘటనను వీడియో తీసి ట్విటర్‌లో షేర్ చేయడంతో ఇండిగో తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో దిగివచ్చిన విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పడమే కాక, బాలుడికి ఎలక్ట్రిక్ వీల్‌ఛైర్ కొనిస్తామని ఇండిగో సీఈవో రోనోజోయ్ దత్తా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News