Thursday, January 23, 2025

ఇండిగో విమానానికి బూటకపు బాంబు బెదిరింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉన్నటు లవచ్చిన బెదిరింపు బూటకమని తేలింది. మంగళవారం తెల్లవారుజామున బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు రావడంతో విమాన సిబ్బందితోపాటు 176 మంది ప్రయాణికులను కిందకు దింపివేసి అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వారణాసికి వెళ్లే ఇండిగో విమానంలోని టాయిలెట్‌లో 5.30 గంటలకు బాంబు అని రాసి ఉన్న కాగితం దొరికినట్లు సమాచారం అందిందని ఆ అధికారి చెప్పారు. వెంటనే విమానంలో తనిఖీలు నిర్వహించామని, ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని, ఈంతో అది బూటకపు బాంబు బెదిరింపుగా నిర్ధారించుకున్నామని ఆయన చెప్పారు. ఇండిగో 6ఇ2211 విమానం వారణాసికి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న సమయంలో టాయిలెట్‌లో ఆ కాగితం పైలట్ కంటపడిందని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News