Monday, December 23, 2024

ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి… అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఇండిగో సంస్థకు చెందిన ఒక విమానాన్ని టేకాఫ్ అయిన కాసేపటికే పక్షి ఢీకొట్టడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన భువనేశ్వర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సోమవారం చోటు చేసుకుంది. ఇండిగో కు చెందిన 6 ఇ 2065 విమానం 180 మంది ప్రయాణికులతో భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. టేకాఫ్ అయిన 20 నిమిషాలకు ఒక పక్షి విమానాన్ని ఢీకొట్టింది.

దీంతో విమానం ఎడమ రెక్కలో తలెత్తిన సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. విమానాన్ని అత్యవసరంగా భువనేశ్వర్ లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News