Monday, December 23, 2024

వారణాసి వెళుతున్న ఇండిగో విమానం హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

 

 

న్యూస్‌డెస్క్: బెంగళూరు నుంచి వారణాసి వెళుతున్న ఇండిగో విమానం బంగళవారం ఉదయం సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. బెంగళూరు నుంచి వారణాసి బయల్దేరిన ఇండిగో విమానం 6ఇ897 ఉదయం 6.15 గంటలకు సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిపినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ) ధ్రువీకరించింది. విమానంలో మొత్తం 137 మంది ప్రయాణికులు ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని డిజిసిఎ తెలిపింది. ఈ సంఘటనపై డిజిసిఎ దర్యాప్తునకు ఆదేశించినట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. తదుపరి వివరాలు తెలియరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News