Wednesday, January 8, 2025

3 విమానాలకు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానాన్ని అత్యవసరం ల్యాండింగ్ అయ్యింది. గోవా నుంచి కోల్ కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు అత్యవసర ల్యాండింగ్ చేశారు. అనంతరం ప్రయాణికులను దింపేసి తనిఖీలు చేశారు. దీంతోపాటు మరో రెండు విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెంగళూరు నుండి హైదరాబాద్ వస్తున్న మరో ఇండిగో విమానం,  హైదరాబాద్ నుండి పూణే వెళ్లనున్న విమానాలకు బెదిరింపు కాల్ వచ్చాయి.

వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది.. విమానాలను ఐసోలేట్ ప్రాంతానికి తరలించి, ప్రయాణికులతోపాటు విమానాలను డాగ్ స్క్వాడ్ తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. కాగా, ఇటీవల కాలంలో దేశంలో విమానాలకు బెందిపు కాల్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి ఫేక్ కాల్స్ కు పాల్పడివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అయినా విమానాలకు బెదిరింపు కాల్స్ మాత్రం ఆగడంలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News