Sunday, April 6, 2025

2 నుంచి హైదరాబాద్‌-కొలంబో మధ్య ఇండిగో విమానాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వచ్చే నెల 2వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి కొలంబో మధ్య కొత్త ప్రత్యక్ష విమానాలను ప్రారంభించనున్నామని ప్రైవేటు విమాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ఈ రెండు నగరాల మధ్య ప్రత్యక్ష విమాన సేవలను అందిస్తున్న తొలి భారతీయ విమాన సంస్థ ఇండిగో కావడం గమనార్హం. దీని ద్వారా రెండు నగరాల మధ్య వాణిజ్యం, ఆర్థిక, సంప్రదాయాలు బలోపేతం కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇండిగో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా వినియోగదారులకు ఈ సేవలను అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News