Tuesday, November 5, 2024

ఇండిగో ప్రయాణంలో పదనిస.. పాట్నా వెళ్లాల్సిన ప్యాసింజర్ ఉదయ్‌పూర్‌కు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో విమాన ప్రయాణికుల మజిలీలు మారుతున్నాయి. పాట్నాకు వెళ్లాల్సిన విమాన ప్రయాణికుడు ఒకరు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దిగాల్సి వచ్చింది. ఈ తికమకల ప్రయాణ సౌకర్యాన్ని ఇండిగో విమానం ఈ ప్రయాణికుడికి కల్పించింది. గత నెల 30వ తేదీన ఢిల్లీలో అఫ్సర్ హుస్సేన్ అనే ప్రయాణికుడు ఇండిగో 6 ఇ 214 విమానంలో పాట్నాకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరాడు. తప్పిదారి ఉదయ్‌పూర్‌కు వెళ్లే 6 ఇ 319 విమానం ఎక్కాడు. తన పొరపాటు ఏమిటనేది ఈ అఫ్సర్‌కు ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో దిగిన తరువాత కానీ తెలిసిరాలేదు. తాను విమానం మారి వేరే మజిలీకి చేరిన విషయాన్ని ప్రయాణికుడు అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులకు తెలియచేసుకున్నాడు.

పొరపాటున ఈ ప్రయాణికుడు వేరే విమానం ఎక్కడం ఓ విషయం అయితే, అసలు గమ్యస్థానం వేరే ఉన్న టికెటును స్కాన్ చేయకుండానే ఈ ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్ విమానాశ్రయ అధికారులు ఏ విధంగా జారీ చేశారనేది మరో కీలక విషయం అయింది. తనకు జరిగిన అనుభవం గురించి విమాన ప్రయాణికుడు తెలియచేయగానే వెంటనే రాజస్థాన్ నుంచి ఆయనను ఢిల్లీకి అక్కడి నుంచి పాట్నాకు విమానయాన సంస్థ వేర్వేరు విమానాలలో చేర్చింది. కానీ జరిగిన అవకతవకపై ఇప్పుడు పౌర విమానయాన అధీకృత సంస్థ డిజిసిఎ స్పందించింది.

అసలు జరిగిందేమిటీ? విమాన ప్రయాణికుల టికెట్ల తనిఖీలలో ఇంత నిర్లక్షం జరుగుతోందా? లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాన్ని దర్యాప్తు క్రమంలో తేల్చుకోనుంది. ప్రయాణికుడు పాట్నాకు 1400 కిలోమీటర్ల దూరంలోని ఉదయ్‌పూర్‌కు చేరుకోవడం ఇందుకు కారణాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా టికెట్లను రెండు పాయింట్ల వద్ద తనికీ చేసిన తరువాతనే సరైన విమానంలోకి ప్రయాణికుడు చేరేలా చూస్తారు.

కానీ ఈ ఉదంతంలో ఇది జరగలేదని వెల్లడైంది. ప్రయాణికుడికి కల్గిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన ఇండిగో విమాన సంస్థ వారు సంబంధిత అధికారుల వివరణలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒక విమానం బదులు వేరే విమానం ఎక్కిన ఘటన ఇండిగోకు సంబంధించి గడిచిన 20రోజులలో ఇది రెండోసారి. ఇంతకు ముందు ఓ ప్రయాణికుడు జనవరి 13న టికెట్ చేతిలో పట్టుకుని, అన్ని తనిఖీల తరువాత ప్రయాణం అయ్యాడు. అయితే ఇండోర్‌కు వెళ్లాల్సిన ఆ వ్యక్తి ఇండోర్ విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News