Friday, November 22, 2024

ఇండిగో లాభం రూ.130 కోట్లు

- Advertisement -
- Advertisement -
IndiGo Q3 Results 2022
ఎండిగా రాహుల్ బాటియా నియామకం

 

న్యూఢిల్లీ : క్యూ3(అక్టోబర్‌డిసెంబర్) ఫలితాల్లో దేశీయ అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో నికర లాభం రూ.130 కోట్లు నమోదు చేసింది. అయితే గతేడాది ఇదే సమయంలో సంస్థకు రూ.620 కోట్ల నష్టం ఉంది. సంస్థ ఆదాయం రూ.4,910 కోట్ల నుంచి రూ.9,295 కోట్లకు పెరిగింది. ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్-గా కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ బాటియాను నియమించినట్టు సంస్థ ప్రకటించింది.

టాటా స్టీల్ లాభం రెట్టింపు

స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ మూడో త్రైమాసిక ఫలితాల్లో రెట్టింపు లాభాలను ఆర్జించింది. కంపెనీ నికర లాభం రూ.9,598 కోట్లతో 139 శాతం పెరిగింది. అత్యధిక ఆదాయం వల్ల సంస్థ లాభాలు పెరిగాయి. గతేడాది సంస్థ లాభం రూ.4,010 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.42,152 కోట్ల నుంచి రూ.60,842 కోట్లకు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News