- Advertisement -
న్యూఢిల్లీ : బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో టిక్కెట్లపై ఇంధన చార్జీలను నిలిపివేసింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరలు నిరంతరం పెరుగుతున్నకారణంగా ఇండిగో 2023 అక్టోబర్ నుండి ఇంధన చార్జీలను వసూలు చేయడం ప్రారంభించింది. ఇంధన చార్జీని తీసివేసిన తర్వాత విమాన టిక్కెట్లు ఇప్పుడు చౌకగా మారే అవకాశముంది. ఎయిర్‌లైన్ నిర్వహణ ఖర్చులలో ఎటిఎఫ్ ప్రధాన భాగం, ఎటిఎఫ్ ధరలు పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుతుంది. ఇప్పటి వరకు రూ.300 నుంచి రూ.1000 వరకు ఇంధనం చార్జీలు వసూలు చేశారు. ఇండిగో రోజుకు 1900 కి పైగా విమానాలను నడుపుతోంది.
- Advertisement -