Wednesday, January 22, 2025

మాల్దీవ్స్‌కు ఇండిగో విమాన సర్వీసులు పునఃప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : మాల్దీవ్స్‌కు ఇండిగో విమాన సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్లు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది. మాల్దీవులకు విహార యాత్రికుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను పూర్తి చేసేందుకు సేవలను పునరుద్ధరించినట్టు జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్‌ఐఎఎల్) ప్రకటించింది.

అక్టోబర్ 31 నుంచి ఇండిగో విమానం 6ఇ-1797 హైదరాబాద్ నుంచి 12:40 గంటలకు బయలుదేరి 14:50 గంటలకు మాలె విమానాశ్రయానికి చేరుకుంటుంది. మాలె నుంచి 15:55 గంటలకు బయలుదేరే విమానం 6ఈ-1798 హైదరాబాద్ విమానాశ్రయానికి 18:45 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్, మాలే నుంచి నాన్ స్టాప్ ఫ్లైట్ ప్రతి మంగళ, గురు, శనివారాల్లో బయలుదేరుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News