Wednesday, January 22, 2025

కర్నాటకలో ఇందిరా క్యాంటీన్లకు కాంగ్రెస్ మంగళం

- Advertisement -
- Advertisement -

నిధుల కొరత, నిర్వహణ లోపంతో 23 క్యాంటీన్లకు తాళాలు
విమాశ్రయం, ఆసుపత్రుల్లో ప్రారంభించేందుకు మరింత ఆలస్యం
రూ. 50 కోట్లు నిధులు అవసరమని బిబిఎంపీ అధికారులు వెల్లడి

మన తెలంగాణ/ హైదరాబాద్: కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా క్యాంటీన్లు నిధుల కొరత, నిర్వహణ లోపంతో మూత పడ్డాయి. బీబీఎంపీ ఆధ్వర్యంలో నిర్వహణ లేకపోవడంతో 23 క్యాంటీన్లకు తాళాలు వేశారు. ఇందిరా క్యాంటీన్లపై రోజురోజుకూ ఉదాసీనత పెరుగుతోంది. నిర్వహణ లోపం, అన్నదాతలకు బిల్లుల చెల్లింపు సమస్యతో క్యాంటీన్లు మూత వేస్తున్నారు. బీబీఎంపీ పరిధిలో 175 శాశ్వత ఇందిరా క్యాంటీన్లు, 24 మొబైల్ క్యాంటీన్లు ఉండగా వాటిలో 6 శాశ్వత క్యాంటీన్లు, 17 మొబైల్ క్యాంటీన్లు సహా 23 క్యాంటీన్ల పనితీరును నిలిపివేయగా, హవేరీలో ఇందిరా క్యాంటీన్లు మూతపడ్డాయి
క్యాంటీన్ మూసివేయడానికి వివిధ కారణాలు :
క్యాంటీన్‌లో ఆహార సరఫరా నిలిపివేతపై బీబీఎంపీ అధికారులు రకరకాల కారణాలు చెబుతున్నారు. మారతహళ్లి క్యాంటీన్ భవనంలోని 6 క్యాంటీన్ల మూసివేతకు సంబంధించి మెట్రో పనుల కోసం భవనాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించేందుకు బీబీఎంపీ గానీ, బీఎంఆర్‌సీఎల్ ముందుకు రాలేదు. అదేవిధంగా హనుమంతనగర్ క్యాంటీన్ లో భోజనం చేసేందుకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కుమారస్వామి లేఅవుట్ క్యాంటీన్ ను మరో వార్డుకు మార్చారు. దానికి తోడు పద్మనాభనగర్ క్యాంటీన్‌కు విద్యుత్, నీటి కనెక్షన్‌లు నిలిచిపోయాయని, క్యాంటీన్‌ను మూసివేశారని సమాధానం ఇస్తున్నారు. అదే విధంగా 24 మొబైల్ క్యాంటీన్లలో మల్లీశ్వర్ సహా 7 చోట్ల మాత్రమే మొబైల్ క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. వాహనాల నిర్వహణ సమస్యల కారణంగా మిగిలిన 17 మొబైల్ క్యాంటీన్లు మూతపడ్డట్లు అధికారులు చెబుతున్నారు.
50 క్యాంటీన్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది:
ప్రస్తుతం ఉన్న 176 క్యాంటీన్లలో 7 మొబైల్ క్యాంటీన్లు. ఈ సంచార క్యాంటీన్ల వాహనాలకు మరమ్మతులు చేయాలన్నారు. అంతే కాకుండా భవనంలో పనిచేస్తున్న 169 క్యాంటీన్లలో 50కి పైగా క్యాంటీన్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, క్యాంటీన్ ఆవరణలో శుభ్రపరిచే పనులు, ఇతర మరమ్మతు పనులు చేపట్టాలి. వీటన్నింటికీ నిధులు అవసరమని, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని బీబీఎంపీ అధికారులు తెలిపారు.
వంటశాలలకు కూడా తాళాలు:
క్యాంటీన్లకే కాకుండా వంట గదులకు కూడా తాళాలు వేశారు. మొత్తం 199 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసేందుకు 19 వంటశాలలను నిర్మించారు. వాటిలో 8 వంటశాలలు మాత్రమే ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాయి, మిగిలిన 11 మూతపడ్డాయి. వాటిలో దొడ్డెనకుండి వంటశాల 2020 నవంబర్ 11 నుండి మూసివేశారు. పేదలకు ఆసరాగా నిలిచిన ఇందిరా క్యాంటీన్ ఒక్కసారిగా మూతపడింది..!
కొత్త క్యాంటీన్లు ఏర్పాటు మరింత ఆలస్యం:
విధానసౌధ, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం సహా కాలేజీలు, ఆసుపత్రుల్లో కొత్త ఇందిరా క్యాంటీన్లను ప్రారంభించాలని బీబీఎంపీ భావించింది. అందుకు రూ. 50 కోట్లకు పైగా గ్రాంట్ అవసరమని అంచనా వేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో వాటి ప్రారంభం మరింత ఆలస్యమవుతోంది. అంతే కాకుండా పాత క్యాంటీన్ల మరమ్మతులు కూడా సాధ్యం కావడం లేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News