Sunday, January 19, 2025

1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు

- Advertisement -
- Advertisement -

మోడీ ‘మంగళసూత్ర’ వ్యాఖ్యలపై ఖర్గే

న్యూఢిల్లీ: దేశ సంపదను, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువమంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1967లో జరిగిన ఇండియా చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాందీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు. అలాంటి త్యాగాలు బీజేపీ కానీ, ఆర్‌ఎస్‌ఎస్ కానీ చేశాయా అని ఖర్గే ప్రశించారు. “ దేశానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేసిన త్యాగాలు ఏమిటి? కనీసం జాతీయోద్యమంలో కూడా వాళ్లు పాల్గొనలేదు.

ప్రజల మంగళ సూత్రాలు సురక్షితం కావంటూ ఎన్నికల కోసం మోడీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఈ దేశాన్ని 55 ఏళ్లు పాలించింది. ఒక్కసారైనా ఇలాంటివి జరిగాయా ? 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారు. పండిట్ మోతీలాల్ నెహ్రూ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అలహాబాద్ లోని తమ ఇంటిని స్వాతంత్ర ఉద్యమం కోసం విరాళంగా ఇచ్చారు. మా నాయకులు దేశం కోసం బతికారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారు” అని ఖర్గే బుధవారం నాడు మీడియా సమావేశంలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News