Sunday, January 19, 2025

అసాధారణ శక్తికి నిదర్శనం ఇందిర: మంత్రి కొండా సురేఖ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌: సాధారణ మహిళ అసాధారణ శక్తిగా ఎదిగిన తీరుకు ఇందిరాగాంధీ ప్రస్థానం నిదర్శనమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానిగా ఈ దేశ గమనాన్ని మార్చిన ఆమె విప్లవాత్మక నిర్ణయాలను, ఆదర్శవంతమైన విధానాలను మంత్రి సురేఖ స్మరించుకున్నారు. భారతదేశం బ్రిటీష్ పాలనలో వున్న సమయంలో, తన చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేందుకు వానర సైన్యాన్ని ఏర్పాటు చేసిన ధీశాలి ఇందిరా గాంధీ అని మంత్రి సురేఖ పేర్కొన్నారు.

ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ దేశ ప్రప్రథమ మహిళా ప్రధానిగా ఆమె సాగించిన రాజకీయ ప్రస్థానం తర్వాత ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. నాలుగు పర్యాయాలు ప్రధానిగా ఇందిర తన పాలనాకాలంలో తీసుకున్న నిర్ణయాలు మన దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాయని అన్నారు. ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా అనేంతగా ఇందిరా గాంధీ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనే లక్ష్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వేల కోట్ల రుణాలను అందిస్తూ వారి స్వయం సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News