Monday, December 23, 2024

కోవిడ్ వారియర్స్‌కు ఇందిర శాంతి పురస్కారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ శాంతి బహుమతి 2022ను ప్రకటించారు. ఈ పురస్కారానికి కోవిడ్ మహమ్మారిపై పోరాడిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఇండియాకు చెందిన శిక్షణ పొందిన నర్సుల సంఘానికి సంయుక్తంగా ప్రదానం చేశారు. శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి అంశాలలో పాటుపడే వ్యక్తులకు, సేవల గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నారు. 2022 ఇందిరా గాంధీ అవార్డును ఆదివారం ఇందిరా గాంధీ జయంతి నేపథ్యంలో ఐఎంఎ అధ్యక్షులు శరద్‌కుమార్ అగర్వాల్,

నర్సుల సంఘం అధ్యక్షులు రాయ్ కె జార్జికి మాజీ రాష్ట్రపతి ఎం హమీద్ అన్సారీ అందచేశారు. ఇందిరా గాంధీ స్మారక ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా ఉన్న కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఈ పురస్కార ప్రదాన కార్యక్రమానికి వచ్చారు. కరోనా దశలో తీవ్రస్థాయి ప్రతికూలతల నడుమనే రోగులకు సేవలందించిన ప్రతి డాక్టరు, నర్సు, వైద్య సిబ్బందికి ఈ అవార్డు చెందుతుందని తెలిపారు. వారి నిస్వార్థ సేవ, అంకితభావం ఎనలేనిదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News