Thursday, December 19, 2024

‘ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ఇందిరా గాంధీని అవమానించినట్టే’

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తు అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. ‘‘కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి తాను ఏం చేశానో ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లోకి వెళుతున్నానని, కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో, మోదీ ఏం చేశారో చెబుతున్నానని వివరించారు. రాముడు అయోధ్యలో పుట్టారనడానికి ఆధారాలేమిటని కించపర్చే వారిని ప్రశ్నిస్తూ జనంలోకి వెళుతున్నానని, కాంగ్రెస్ వాళ్లకు దమ్ముంటే.. ఇదే విధానాలతో, నినాదాలతో ఎన్నికల్లోకి వెళ్లాలని సూచించారు.

కరీంనగర్ లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే..  మంత్రి పదవికి పొన్నం ప్రబాకర్ రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా? అని సవాల్ విససిరారు. 6 గ్యారంటీలను అమలు చేయడం చేతగాక ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర చేస్తుంటే కాంగ్రెస్ మూకలను పంపి విధ్వంసం సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని పొన్నం ప్రభాకర్ ను హెచ్చరించారు. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారని… ఇప్పుడు కూడా ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చూస్తున్నారని మండిపడ్డారు.

రేవంతన్నా… పొన్నం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మలిదశ ప్రజాహిత్ర 2వ రోజు బొమ్మెనపల్లిలో ప్రారంభమై రాములపల్లెలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో కాంగ్రెస్ మూకలు బిజెపి ఫ్లెక్సీలు చింపివేస్తూ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.  ప్రజాహిత యాత్రను ప్రశాంతంగా కొనసాగిస్తున్నాం. మేం చేసిన అభివృద్ధి, మోదీ ప్రభుత్వం చేసిన పనులను, కేంద్రం ఈ నియోజకవర్గానికి వెచ్చించిన నిధులను వివరిస్తూ ప్రజాహిత యాత్రను కొనసాగిస్తున్నామని, కానీ ఇక్కడున్న మంత్రి ప్రతిసారి హల్ చల్ చేయాలని చూస్తున్నారని, ప్రతిదాంట్లో కలుగజేసుకుంటున్నారని మండిపడ్డారు.

వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పారని,. ఇందిరాగాంధీ ఫోటో పెట్టుకుని మేనిఫెస్టో విడుదల చేశారని, ఇవాళ్టికి 80 రోజులైందని, ఎందుకు అమలు చేయడం లేదు? అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను, మేనిఫెస్టోలోని 423 హామీలను అమలు చేయకుంటే ఇందిరాగాంధీని అవమానించినట్లే ధ్వజమెత్తారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయిందని, అయినా హామీలు ఎలా ఇచ్చారని, వాటిని ఎట్లా అమలు చేస్తారో చేసి చూపాలని సవాల్ విసిరారు. పిఎం నరేంద్రమోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తుంటే రేషన్ షాపుల మద్ద ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టుకోవడమేంటని, ప్రధాని ఫోటో ఎందుకు పెట్టుకోవడం లేదని అడిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News