ప్రారంభానికి అధికారులు కసరత్తు
కొనసాగుతున్న లోడ్ టెస్టింగ్ పరీక్ష
స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ గ్రేటర్‌లో పొడవైనది
ఇక ఇందిరా పార్క్ నుంచి విద్యానగర్ జంక్షన్ వరకు సిగ్నల్ రహిత ప్రయాణం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగరం లో సిగ్నల్ రహిత ప్రయాణమే లక్షంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగతా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ది ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా ని ర్మించిన మరో అద్భుతమైన స్టీల్ బ్రిడ్జ్ ఎలివేటెడ్ కారిడార్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. రూ.450 వ్యయంతో నగరంలో అతి పొడవుతో పాటు అత్యత్త ఎత్తులో ఇందిరాపార్క్ నుంచి విఎస్‌టి వ రకు నిర్మించిన స్టీల్ ఫ్లైఓవర్ త్వరలో ప్రా రంభోత్సవానికి సిద్ధమవుతోంది. 2020 జూలై 11వ తేదీన పురపాలక శాఖ మం త్రి కె.తారక రామారావు చేతుల మీదగా శంకుస్థాపన చేయగా సరిగ్గా మూడేళ్ల కాలంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూరైంది.
ఈ స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ ద్వారా ఇందిరా పార్క్ నుండి విద్యానగర్ జంక్షన్ వరకు సిగ్నల్ రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్, అశోక్‌నగర్ జంక్షన్, ఆర్‌టిసి ఎక్స్ రోడ్స్ జంక్షన్, బాగ్ లింగంపల్లి జంక్షన్లలో ట్రాఫిక్ స మస్య పూర్తిగా పరిష్కారం కానుంది. సచివాలయం నుంచి ఇందిరా పార్క్ మీదుగా విద్యానగర్ ప్రాంతాలకు వెళ్లే వారు. తెలుగుతల్లి ప్లైఓవర్ ఎక్కితే చాలు దాదాపుగా 6 కిలో మీటర్ల మేర పూర్తిగా సిగ్నల్ రహిత ప్రయాణం సాగించవచ్చు.
నగరంలోనే అత్యంత ప్రత్యేకం
ఇందిరా పార్క్ నుంచి విఎస్‌టి వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఫ్ల్లైఓర్ ప్రత్యేకమైంది. దాదాపు 12, 500 మెట్రిక్ టన్నుల ప్రత్యేక అల్లాయ్ స్టీల్, 20వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌తో 2.81 కి.మీ పొడవైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ఫ్ల్లైఓవర్ గ్రేటర్‌లోనే మొట్టమొదటిది. ఈ ఫ్లైఓవర్‌ను 81 స్టీల్ ఫిల్లర్లతో నిర్మించారు. ఇం దులో 46 పిల్లరు పునాదులు సహా స్టీల్‌వే కాగా, మిగిలిన బహిరంగ పునాదులు ఉన్నాయి. మొత్తం 426 స్టీల్ గిర్డర్‌ల సహాయంతో 16.60 మీటర్ల వెడల్పుతో 4లేన్‌లో ఈ ప్లైఓవర్‌ను తీర్చిదిద్దారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్ వద్ద, ఫ్లైఓవర్‌ను 26.54 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇక్కడ మైట్రో రైలు వంతన మీదగా నిర్మించడం స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకత. స్టీల్ బ్రిడ్జి ప్లైఓవర్ పనులన్ని పూర్తి కావడంతో ప్రస్తుతం దీనిపై లోడ్ టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. 10 రోజులపాటు ఈ పరీక్ష అనంతరం దీనిని ప్రజల కు అందుబాటులోకి తీసుకురానున్నారు.