Sunday, December 22, 2024

ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవ ప్రతీకలు

- Advertisement -
- Advertisement -

రూ.22,500కోట్లతో 4.50లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 3500ల ఇండ్లు నిర్మిస్తాం
పథకం ప్రారంభోత్సవంలో సిఎం

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో :  తెలంగాణ వ్యాప్తంగా రూ.22,500 కోట్లతో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, పేదల ఆత్మగౌరవంతో బతకాలనే ఆలోచనతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి శాసనసభ నియోజక వర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సిఎం హోదాలో తొలిసారి సోమవారం భదాచలం విచ్చేసిన ఆయన ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ మైదానంలో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భద్రచలంలో భద్రాద్రి రాముని పాదాల సాక్షిగా, ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

పేద ప్రజల చిరకాల కోరిక ప్రతి దళిత, గిరిజన, బడుగు బలహీన, మైనారిటీల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్లు అని అభివర్ణించారు. పేదవాళ్లు గ్రామాల్లో ఆత్మగౌరవంతో బతకాలి, పది మందిలో తలెత్తుకొని నిలబడలంటే ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలని ఆలోచించి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన వచ్చిన తర్వాత భద్రాచలంలో ఆడబిడ్డ ఆశీర్వాదంతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనని, ఇంటి పెత్తనం తమ చేతిలో ఉంటే దానిని చక్కబెట్టే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుందని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు ఆడ బిడ్డల పేరుపై మంజూరు చేస్తామని, ఇంటి పట్టా ఆడ బిడ్డ పేరుపై ఉంటుందని, అలా ఉన్నప్పుడే ఆ ఇంట్లో పిల్లలు చదువుకుంటారని, ఆ కుటుంబం సమాజంలో గౌరవంగా బతకగలదని తమ ప్రభుత్వం నమ్మిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల్లోనే నేటికీ పేదవారు ఉంటున్నారని ఆయన అన్నారు. నాడు రెండేళ్ల పిల్లవాడు ఇప్పుడు పాతికేళ్లవాడు అయ్యాడని, ఆయనకు పెళ్లి అయ్యే పరిస్థితి వచ్చిందని వారికి సొంత ఇల్లు, వారు ఆత్మగౌరవంతో బతకాలనే ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ప్రారంభిస్తున్నామని సిఎం చెప్పారు.
ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే కెసిఆర్, మోడీ ఓట్లు అడగాలి
2014 ఎన్నికల ముందు డబ్బా ఇల్లు వద్దు… డబుల్ బెడ్‌రూం ఇల్లు ముద్దు.. కొడుకు, కోడలు పండగ రోజు బిడ్డ, అల్లుడు వస్తే ఎక్కడ ఉంటారు. గొర్రె, మేక పిల్లలు ఎక్కడ కట్టేస్తారంటూ ఇంటిపైన పేదలకు ఉండే కలలపైన కెసిఆర్ వ్యాపారం చేశారని ముఖ్యమంత్రి విమర్శించారు. సొంత ఇల్లు లేక, కిరాయి కట్టలేక గుడిసెలోనో, వేరే ఇళ్లలోనో ఉన్న పేదలను కెసిఆర్ ఏదో చేస్తారని ఆశించారని, ఒక్కసారి కాదు చెప్పిన కథే సర్పంచి, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, రెండు సార్లు ఎంఎల్‌ఎ ఎంపి ఎన్నికల ముందు పదేళ్ల పాటు చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మోసాలకు, అబద్ధాలకు కాలం చెల్లిందిన, చెప్పి బిఆర్‌ఎస్‌ను బొందబెట్టి తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. అందుకే తాము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి భద్రాద్రి రామచంద్రుని ఆశీర్వాదంతో ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

పేదలు, అర్హులైన వారికే తాము ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, కోటీశ్వరులకు ఇవ్వమని స్పష్టం చేశారు. ఏ పథకం ప్రారంభించినా దానిని మొత్తం అమలు చేసే బాధ్యత ప్రభుత తీసుకుటుందని, హడావిడిగా ప్రారంంభించి అటక మీద పెట్టే ప్రయత్నం చేయమని ఆయన స్పష్టం చేశారు. నాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. డబుల్ రూం ఇళ్లు ఉన్న ఊళ్ల్లో కెసిఆర్ ఓట్లు వేయించుకోవచ్చని, ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊళ్ల్లో తాము ఓట్లు వేయించుకుంటామని, ఇందుకు కెసిఆర్ సిద్ధమా అని సవల్ విసిరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాటలకు హద్దే లేదని, ఆయన మంచి మంచి డ్రెస్‌లు డ్రెస్‌లు వేస్తూ, తియ్యతియ్యని మాటలు చెబుతారని విమర్శించారు.

2022 వరకు దేశంలోని పేదలందరికీ ఇళ్లు ఇస్తామని, గత ఎన్నికల మందు బిజెపి మేనిఫెస్టోలో పెట్టారని, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వారు ఎన్ని ఇళ్లు కట్టించారో బిజెపి నాయకులు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, లక్ష్మణ్ చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద బిజెపి నాయకులు ఓట్లు వేయించుకోవచ్చని, అక్కడ తాము ఓట్లు అడగమని, అసలు రాష్ట్రంలో బిజెపి ఎన్ని ఇళ్లు ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, మోడీ హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. కానీ పెట్టుబడి దక్కక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, కనీస మద్దతు ధర కోసం ఢిల్లీ సరిహద్దులో దీక్ష చేస్తుంటే మోడీ ప్రభుత్వం తుపాకీ తూటాలు పేల్చి రైతులను బలి తీసుకుందని ఆరోపించారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారని, రూ.15 లక్షలు కాదు.. రూ.15 పైసలైనా వేయలేదని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్ని మోడీ చెప్పారని, అలా చేసినట్లైతే ఈ పదేళ్లలో తెలంగాణ కనీసం 60 నుంచి 70 ఉద్యోగాలు వచ్చేవని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News