Tuesday, November 5, 2024

ఇందిరమ్మ ఇండ్లు.. స్థలాలు లేని వారికి అప్డేట్…

- Advertisement -
- Advertisement -

ఇండ్ల స్థలాలు లేని వారికి రెండో దశలో ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి హామీనిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిస్థలం లేని వారికి 75 నుంచి 80 గజాల స్థలంలో ఇళ్లు కట్టి ఇస్తామన్నారు. ఎక్కడైనా కొత్తగా ఇందిరమ్మ కాలనీలు ఏర్పడితే విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులను ప్రభుత్వం సమకూరుస్తుందన్నారు.

ఎన్నికల వరకే రాజకీయాలని ఇండ్ల నిర్మాణం విషయంలో కేంద్రం ఎంత ఇచ్చినా తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఏమీ ఇవ్వకపోయినా ఇళ్లను నిర్మించి పూర్తి చేస్తామన్నారు. ఎలాంటి బేషజాలకు పోవడం లేదని, తమకు ఇగోలు లేవని ఆయన పేర్కొన్నారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి కేంద్రాన్ని ఇళ్లు అడగలేని ఆయన ఆరోపించారు. నందనవనం, మంకాల్ ఇళ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీనిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News