Wednesday, January 22, 2025

ఇందిరమ్మ ఇళ్ల కమిటీ ఏర్పాటుపై జీవో విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆరు హామీల్లో ప్రధానమైనది ఇందిరమ్మ ఇళ్లు.  పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక  నిర్ణయం తీసుకున్నారు.  ఇళ్ల లబ్ధిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)ను శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసింది.

గ్రామ పంచాయితీల్లో, మున్సిపల్ వార్డు స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు  చేస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. గ్రామ స్థాయిల్లో సర్పంచ్ లేక ప్రత్యేక అధికారి ఛైర్ పర్సన్ గా ఉండనున్నారు. అలాగే మున్సిపాలిటీ స్థాయిల్లో కౌన్సిలర్ లేక కార్పొరేటర్ ఛైర్ పర్సన్ గా ఉండనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్ గా పంచాయతీ కార్యదర్శి, వార్డ్ ఆఫీసర్ ఉంటారు. అలాగే కమిటీలో ఇద్దరు ఎస్ హెచ్ జి సభ్యులు, ముగ్గురు స్థానికులు ఉండనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News